రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి
- ఏసీపీ రమేష్ కుమార్
విశ్వంభర, బాగ్‌లింగంపల్లి : రక్తదానం చేయడం ద్వారా ప్రాణదాతలుగా నిలవొచ్చ ని, . యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలని చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ అన్నారు. హైదరాబాదు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో భగత్‌సింగ్ స్మారక యువజన ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడుతూ, రక్తదానం అత్యంత గొప్ప సేవ అని, ఒకరి రక్తం మరొకరి ప్రాణాన్ని కాపాడగలదని, రక్తదానం చేసిన యువతను అభినందిస్తు యువకులు, విద్యార్థులు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ ఏడుకొండలు, కాచిగూడ సీఐ రాజశేఖర్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, నిరుద్యోగం, మాదకద్రవ్యాల వ్యాప్తి వంటి సమస్యలపై చైతన్యంతో స్పందించాలని తెలిపారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్, వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా భగత్‌సింగ్ యువజన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐపీఎం బ్లడ్ బ్యాంక్ ఇన్‌చార్జి మాధవి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అశోక్ రెడ్డి, లెనిన్, జావీద్, రాజయ్య, రజనీకాంత్, ప్రవీణ్, అర్జున్, ఆశ్వక్, మనోజ్, మదన్ పాల్గొన్నారు.



