ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం

విశ్వంభర,చండూరు:-  మండల రైతులకు రైతు సేవా సహకార సంఘం చండూరు ఆద్వర్యంలో  కస్తాల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఆర్డీఓ శ్రీదేవి, రైతు సేవా సహకార సంఘం అధ్యక్షులు,డి.సి.సి.బి డైరెక్టర్  కోడి సుష్మా వెంకన్న లచే ప్రారంభించారు.  కావున రైతులు తమ యొక్క వడ్లను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర గ్రేడ్ - ఏ కు 2389/- మరియు గ్రేడ్ - బీ కు 2369/- రూపాయలు  ,కావున మండల కేంద్రం లోని రైతులు తమ వడ్లను దళారులకు అమ్మి మోసపోవద్దు .ప్రభ్యుత్వం తెలిపిన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మద్దతు ధర పొందగలరు .అలానే రైతులు వడ్లను కేంద్రానికి తీసుకవచ్చేటప్పుడు రైతు ఆధార్ కార్డు,బ్యాంక్ పాసు పుస్తకం,భూమి పాసుపుస్తకాలు ఒకే రైతువి కేంద్రం లో సమర్పించగలరు . తేమ 17% లోపు ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు .అలాగే రైతులు తమ ఆధార్ కార్డు కి ఫోన్ నెంబర్ తప్పకుండా లింక్ చేసుకొని ఉండాలి . అదే విందంగా రైతులు తమ పంట నమోదు వరి అని ఉన్నదో లేదో అని తమ ఏఈఓ దగ్గర సరిచూసుకోగలరు .ఇట్టి  అవకాశాన్ని మండల రైతు సోదరులు సద్వినియోగం చేసుకోగలరని రైతులకు సూచించారు .ఇట్టి కార్యక్రమము లో  ఎంపీడీఓ యాదగిరి ,ఎమ్మార్వో చంద్రశేఖర్ ,ఏ ఓ చంద్రిక,ఏఈఓ భార్గవి, సంఘ డైరెక్టర్లు కట్ట భిక్షం,బోడ ఆంజనేయులు,డోలె నర్సాజీ,అచ్చిన శ్రీనివాసులు,చెరుపల్లి ఆంజనేయులు,సంఘ సెక్రటరీ పాల్వాయి అమరేందర్ రెడ్డి & సిబ్బంది రైతులు మరియు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags: