ఉపాధ్యాయురాలిగా మారిన కలెక్టర్ ప్రతిమా సింగ్

  • విద్యార్థులకు పాఠాలు బోధించి సామర్థ్యాలు పరిశీలన.. కేజీబీవీ సౌకర్యాలపై ఆరా

విశ్వంభర, పెద్దశంకరంపేట: విద్యార్థి దశలోనే క్రమశిక్షణను అలవర్చుకుంటే భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. శనివారం చేగుంట మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను సందర్శించిన కలెక్టర్, విద్యార్థులతో మమేకమై ఉపాధ్యాయురాలిగా మారి స్వయంగా పాఠాలు బోధించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి వారి ప్రతిభపై సంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగా 6, 7వ తరగతి విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులు ఎనిమిది వరకు గుణకార పట్టికలు చెప్పడంతో అభినందించారు. అనంతరం పదో తరగతిలో నిర్వహిస్తున్న అన్ అకాడమీ తరగతులను పరిశీలించి, ఫాస్ట్ మ్యాథ్స్, గెట్ ఇట్ రైట్ పుస్తకాల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. పోటీ పరీక్షల్లో గణితం కీలకమని, ఫాస్ట్ మ్యాథ్స్ ద్వారా లెక్కలను సులభంగా సాధన చేయవచ్చని సూచించారు. యూట్యూబ్ వీడియోల కంటే అన్ అకాడమీ తరగతులు విద్యార్థులకు మరింత ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. పాఠశాలలోని కొన్ని కంప్యూటర్లు మరమ్మతులకు గురైనట్లు గుర్తించిన కలెక్టర్, వాటిని వెంటనే బాగు చేసి ప్రతి విద్యార్థికి డిజిటల్ బోధన అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కిచెన్‌ను సందర్శించి వంట సామగ్రి, సిద్ధం చేసిన భోజనాన్ని పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన డైట్ చార్ట్ ప్రకారమే భోజనం తయారు చేస్తున్నారా, ఎంత మంది విద్యార్థులు వసతి గృహంలో ఉంటున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.  కేజీబీవీ ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉండాలని, ఎలాంటి చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అన్ని కేజీబీవీల్లో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా చదివితే తెలియని అంశాలపై కూడా పట్టు సాధించవచ్చని, ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా విద్యార్థులకు అన్ని అంశాలను బోధించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, బీడబ్ల్యూఓ హేమాభార్గవి, ఎంపీడీవో చెన్నారెడ్డి, గణాంక అధికారి నవీన్, కేజీబీవీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

🕒 26 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/collector-turned-teacher-pratima-singh/article-19736

Tags: