పరిగి శ్రీ సరస్వతి శిశు మందిర్ అభివృద్ధికి రూ. 5 లక్షలు 

  •  ఎంపీ  కొండ విశ్వేశ్వర్ రెడ్డి

విశ్వంభర, పరిగి : శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించే ఉద్దేశంతో, చేవెళ్ల  పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి తమ ఎంపీ నిధుల నుండి రూ. ఐదు లక్షల నిధులను అదనపు తరగతి గదుల నిర్మాణ నిమిత్తం మంజూరు చేశారు. విద్యారంగ అభివృద్ధికి, పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ఎంపీ ప్రాధాన్యత అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాలకవర్గ సభ్యులు స్థానిక నాయకులు తెలిపారు.  అదనపు గదుల నిర్మాణం పూర్తయితే విద్యార్థులకు మరింత మెరుగైన విద్యా  అందుబాటులోకి వస్తుందని  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంత సంఘటన శ్రీనివాస్, పాఠశాల అధ్యక్షులు  శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి వెంకట్ రాములు, పాఠశాల ప్రధానాచార్య  మల్లేష్ , బిజెపి రాష్ట్ర నాయకులు మిట్ట పరమేశ్వర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుల బాలకృష్ణారెడ్డి, జిల్లా నాయకులు పెంటయ్య గుప్తా,  మల్లేష్, బందెయ్య, తదితరులు పాల్గొన్నారు.

🕒 26 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/5-lakhs-for-the-development-of-parigi-sri-saraswati-shishu/article-19746

Tags: