రిటైర్డ్ హెడ్‌మాస్టర్ కు సన్మానం

రిటైర్డ్ హెడ్‌మాస్టర్ కు సన్మానం

విశ్వంభర,  గుండాల :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మోత్కూర్ యూనిట్ ఆధ్వర్యంలో సంఘ భవనంలో ఏప్రిల్ నెలలో జన్మదినం ఉన్న పెన్షనర్లకు సామూహిక జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వస్తా కొండూరు గ్రామానికి చెందిన రిటైర్డ్ హెడ్‌మాస్టర్, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మోత్కూరు యూనిట్ ఉపాధ్యక్షులు శ్రీరంగం నర్సయ్యను సన్మానించారు. యూనిట్ అధ్యక్షులు బి. యాదిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు అవిలిమల్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో యూనిట్ ఉపాధ్యక్షులు టి. మనోహర చారి, కార్యదర్శి ఏ. వల్లభాయ్, కోశాధికారి యాదగిరి, ఆర్గనైజింగ్ కార్యదర్శి బి. రామ్ రెడ్డి, జిల్లా ప్రతినిధులు ఏ. సత్యనారాయణ, ఎస్. భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత శ్రీరంగం నర్సయ్య మాట్లాడుతూ, తమ జీవితంలో ఇది ఒక మధురమైన ఘట్టమని పేర్కొన్నారు. ఇంతమంది స్నేహితులు, సహచరుల మధ్య ఇలాంటి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: