ఘనంగా ప్రజా పాలన కార్యక్రమం

ఘనంగా ప్రజా పాలన కార్యక్రమం

విశ్వంభర, మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆవరణలో   హసీనా భాను అక్బర్ ఖాన్ అధ్యక్షత గ్రామసభ నిర్వహించి ప్రజా పాలన -ప్రగతి-ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం గురించి చర్చించికొని గ్రామసమస్యల గురించి మరియు వివిధ ప్రభుత్వ శాఖల యొక్క పథకాల గురించి వివరించడం జరిగింది. మరియు సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలు భాగంగా మహాదేవపూర్ గ్రామపంచాయతీ కార్యాలయమును శుభ్రపరచడం జరిగింది  , ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీజ, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి కల్పన మరియు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: