'నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని.. ఖబడ్దార్': విపక్షాలకు మాస్ వార్నింగ్

'నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని.. ఖబడ్దార్': విపక్షాలకు మాస్ వార్నింగ్

యూ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అంటూ సంచలన ఆరోపణలు చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ ఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇటీవల ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై వరుస ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ నేతలు చాలా మంది స్పందించారు కానీ.. ఉత్తమ్ కుమార్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. అయితే.. లేట్ అయినా లేటెస్టుగా సమాధానం చెప్పారు మంత్రి ఉత్తమ్. తాను ఉత్తమ్ కుమార్ రెడ్డిని అని.. ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేదే లేదని తేల్చి చెప్పారు. 

 

Read More పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడంపై CM స్పందన

ఢిల్లీకి డబ్బు పంపించే సంస్కృతి బీజేపీలో ఉంది కానీ.. కాంగ్రెస్‌లో లేదని అన్నారు. ఇంతవరకు 200 కోట్ల రూపాయాల ధాన్యం కొనుగోలు మాత్రమే జరిగిందని.. అలాంటిది రూ. 2 వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. బయట ఆరోపణలు చేసి.. సీఎం రేవంత్ రెడ్డితో ల్యాండ్ సెటిల్‌‌మెంట్ విషయాలు మాట్లాడిన నువ్వా నాపై ఆరోపణలు చేసేది అని మహేశ్వర్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

 

Read More పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడంపై CM స్పందన

బీఆర్ఎస్, బీజేపీ మాటల్లో నిజం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసరఫరాల శాఖను బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందనిని మండిపడ్డారు. రూ.11 వేల కోట్ల అప్పుల్లో ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో అవినీతి లేదని, రైతులకు చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.