ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం

విశ్వంభర, గుండాల : గుండాల మండలం నూనెగూడెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండాల ఉపాధ్యాయులు బడి బాట కార్యక్రమంలో భాగంగా గురువారము ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట  కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్  మద్దెపురం కొండమ్మ పరుశరాములు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను  బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. గ్రామంలోని పిల్లలను ప్రైవేట్ బడికి పంపకుండా  ప్రభుత్వ బడిలో చేర్పించాలని  ఉపాధి హామీ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులను కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గంధం చంద్రకళ మాట్లాడుతూ  ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని చెప్పారు గత ప్రస్తుత సంవత్సరము పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత  సాధించామని చెప్పారు. ఇంకా మాట్లాడుతూ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు,, ఉదయం రాగి జావా, వారానికి మూడు కోడిగుడ్లతో మధ్యాహ్న భోజనము అందిస్తున్నామని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్  అండెం ప్రశాంత్ రెడ్డి , ఉపాధ్యాయులు గొడుగు బాలరాజు, పంచాయతీ సెక్రెటరీ అల్లంశెట్టి ప్రియాంక ,  ఫిల్డ్ అసిస్టెంట్ దయాకర్,వివాకర్ తదితరులు పాల్గొన్నారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/honorable-professor-jayashankar-badibata-program/article-15844

Tags: