మహేశ్వరం లో రక్తదాన శిబిరం
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం గ్రామంలోని శివగంగ రాజరాజేశ్వరి ఆలయంలో ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ 43వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయం అందించే ఉద్దేశంతో రక్తదానం చేపట్టారు. ఈ కార్యక్రమం రేవెల్ల గిరి సాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నవీన్, ఉప సర్పంచ్ రమేష్,చంద్రయ్య, రేవెల్ల చంద్రమౌళి, స్వర్ణ కంటి ఆనందం, ఆలయ కమిటీ చైర్మన్ అల్లే కుమార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



