ఘనంగా రోడ్డు భద్రత వారోత్సవాలు 

ఘనంగా రోడ్డు భద్రత వారోత్సవాలు 

విశ్వంభర, గుండాల: వస్తాకొండూరు గ్రామంలో రోడ్డు భద్రత వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామపంచాయతీ సర్పంచ్ లింగాల అనిల్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్యదర్శి ఎస్.కే. ఇస్మాయిల్ రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. సర్పంచ్ మాట్లాడుతూ, చిన్నపిల్లలకు బైకులు, ఇతర వాహనాలు ఇవ్వకూడదని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవిస్తాయని హెచ్చరించారు. అలాగే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగించాలని, అతివేగం ప్రమాదాలకు కారణమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు

Tags: