సమాచార హక్కు చట్టాన్నిదుర్వినియోగం చేస్తున్నారు
- ఆర్టిఐ కార్యకర్త అందే రఘు
విశ్వంభర, బోడుప్పల్: భారత దేశం లో సమాచార హక్కు చట్టాన్ని అత్యంత విఫలమైన చట్టంగా ప్రజలూ చెబుతున్నారని ఆర్టిఐ కార్యకర్త అందే రఘు పేర్కొన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టానికి 2012 సంవత్సరం నుండి కార్యకర్తగా పని చేస్తున్నానని చెప్పారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఉపయోగపడే సమాచార చట్టాన్ని తమ హక్కును అడిగినప్పుడు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర శాఖల్లో కొన్ని వేల ధరకాస్తులు చేశాను. ఏ అధికారికి అయిన చట్టం అంటే గౌరవం లేదు, భయం అంతకన్నా లేదు, చాలా మంది అధికారులు 12,15 పేజీల సమాచారం ఈవ్వడానికి జీరాక్సుల ఖర్చు నిమిత్తం 25 వేల రూపాయలు కట్టాలి అని సమాధానం ఇచ్చారు. చాలా వరకు దరఖాస్తులు సమాచార కమిషన్ ల వరకు వెళ్ళాయి కానీ వారు ప్రజలకు సమాచారాన్ని అందించలేదు. సమాచారం ఇవ్వని నిందితులకు శిక్ష పడింది లేదు, ఒకవేళ శిక్ష పడినా అమలు అయింది లేదు, ఒకవేళ జరిమానా వేసిన వారు కట్టింది లేదు. భారతదేశం లో ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన చట్టంగా ఉద్దేశించి రూపొందించిన సమాచార హక్కు చట్టం ఇప్పుడు అది అత్యంత విఫలమైన చట్టంగా మారిందని అన్నారు. తమ అధికారాన్ని, తమ హక్కును ప్రజలకు కల్పించాలని అందే రఘు విజ్ఞప్తి చేశారు.



