విద్యుత్ పై కేంద్రంతో ఒప్పందం చేసుకున్నది బీఆర్ఎస్సే 

  •  టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ 

విశ్వంభర, హైదరాబాద్: సమగ్ర విద్యుత్ సరఫరా పథకంలో తెలంగాణ ప్రభుత్వం చేరడంపై బీఆర్ఎస్ నాయకులు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ విమర్శించారు. ఈ మేరకు  ఆయన మీడియాతో మాట్లాడుతూ 2017 జనవరి 4న ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఢిల్లీలో ఒప్పందం చేసుకున్నదని ఆయన వివరించారు. ఆ ఒప్పందంపై కేంద్రం నుంచి జాయింట్ సెక్రటరీ డాక్టర్ అరుణ్ కుమార్ వర్మ, అండర్ సెక్రటరీ నరేందర్ సింగ్ లు సంతకాలు చేయగా, రాష్ట్ర విద్యుత్ డిస్కంల నుంచి చైర్మన్లు రఘుమారెడ్డి, గోపాల్ రావులు, ఎన్పీడీసీఎల్ సెక్రటరీ వెంకటేశం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రాలు సంతకాలు చేశారని బండి సుధాకర్ గౌడ్ వెల్లడించారు. ఈ ఒప్పందం చేసుకోలేదని బీఆర్ఎస్ నాయకులు చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్నపుడు తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెట్టి, అధికారం పోగానే అహంకారంతో మాట్లాడటం బీఆర్ఎస్ నాయకులకు అలవాటైందన్నారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తుంచుకోవాలన్నారు. ఇవాళ 50 లక్షల ఇండ్లకు 200 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా సరఫరా చేస్తున్నది కూడా రేవంత్ ప్రభుత్వమేనన్న విషయం మరిచిపోవద్దన్నారు.  రైతులకు, ఇండ్లకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నంక ఇక మీటర్ల ప్రస్తావన ఎక్కడిదో బీఆర్ఎస్ నాయకులే చెప్పాలన్నారు. అసత్య అరోపణలు, అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే సహించేది లేదు, ఖబర్దార్ అని బండి సుధాకర్ హెచ్చరించారు.ప్రజలు బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మకుండా వాస్తవాలను తెలుసుకోవాలని ఆయన కోరారు.  వాస్తవాలను వక్రీకరించి, నిజాలను దాచిపెడుతున్న బీఆర్ఎస్ నాయకులపై చట్టరీత్యా బీఎన్ఎస్ 212 సెక్షన్ కింద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బండి సుధాకర్ కోరారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/brse-has-entered-into-an-agreement-with-the-center-on/article-15861

Tags: