రోడ్డు ప్రమాదంలో వ్యక్తి  మృతి

విశ్వంభర, త్రిపురారం: త్రిపురారం మండలం మాటూరు గ్రామ శివారులో ఆదివారం  బొడ్డుపల్లి భద్రయ్య బైక్ పై మిర్యాలగూడ వెళుతున్న క్రమంలో స్కిడ్ అయి తలకు తీవ్ర గాయమై  మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎస్సై  నరేష్  తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..   ఆదివారం సాయంత్రం  4:00 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ రూరల్ మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన బొడ్డుపల్లి భద్రయ్య  అడవిదేవులపల్లి నుండి మిర్యాలగూడ వైపు బైక్ పై వెళ్తుండగా, బైక్ స్కిడ్ అయి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయం కావడంతో ఎక్కువగా రక్తస్రావం జరిగింది. ఆ సంఘటన సమయంలో స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చి మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  ఆసుపత్రికి చేరుకునే సమయానికి పరిస్థితి విషమించి, డాక్టర్లు ఆయన మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడి భార్య ఉమ  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని, మృతుడికి 8 సంవత్సరాల వయస్సు గల ఒక పాప ఉందని చెప్పారు.

Tags: