మోడల్ ఎంసెట్, నీట్ పరీక్షల పోస్టర్ ఆవిష్కరణ

మోడల్ ఎంసెట్, నీట్ పరీక్షల పోస్టర్ ఆవిష్కరణ

విశ్వంభర, హైదరాబాదు : ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి 28 వరకు నిర్వహించనున్న మోడల్ ఎంసెట్, నీట్ పరీక్షల పోస్టర్‌ను నగరంలోని రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య పర్యవేక్షణలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ గ్రామీణ, పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 300 కేంద్రాల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన టాప్ 10 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో రజనీకాంత్, కిరణ్, మమత, లెనిన్, నాగేందర్, ప్రవీణ్, ఆంజనేయులు, కార్తీక్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Tags: