160వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహణ

160వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహణ

  • అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, గద్దర్ ఆశయాలను స్మరించిన వక్తలు

విశ్వంభర, హైదరాబాద్: హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన 160వ జ్ఞానమాల కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, ప్రజా గాయకుడు గద్దర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ ప్రజా నాట్య మండలి మేడ్చల్ జిల్లా కార్యదర్శి వెంకటాచారి, బీఎస్‌ఎన్‌ఎల్ రిటైర్డ్ ఉద్యోగి ఎస్. శివశంకర్, ఏపీటీఎఫ్ రిటైర్డ్ హెడ్‌మాస్టర్ సంపత్ కుమార్, పీఆర్టీయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, రిటైర్డ్ హెడ్‌మాస్టర్ బాలమల్లేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, గద్దర్ జీవితాలు, వారి ఆశయాలపై ప్రసంగించి, సామాజిక సమానత్వం, విద్య, ప్రజా చైతన్యం కోసం వారు చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు జి. రాజయ్య, అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటీ ప్రతినిధులు టి.ఎం. కృష్ణ, పీబి ఓంకార్ అతిథులను శాలువాలతో సన్మానించారు. రిటైర్డ్ ఎస్‌టీవో సి.ఎల్. యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సి.ఎల్. కృష్ణ, మహేందర్, కైసర్, టి. గణేష్, కె. శ్రీనివాస్, కె. చందర్, రవి, రమేష్ ముదిరాజ్, సాయి, చిత్తయ్య, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

🕒 07 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/conducting-160th-gnanamala-programme/article-18093

Tags: