లోన్లు ఇప్పిస్తానని మోసగించిన వ్యక్తి అరెస్ట్
- : మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి
విశ్వంభర, మహబూబాబాద్ : నీతి అయోగ్ డైరెక్టర్ అని చెప్పుకుని ఎస్టి కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇప్పిస్తానని నమ్మించి పలువురి వద్ద నుండి సుమారు 1,85,000 రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యక్తిని మహబూబాబాద్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు టౌన్ ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి తెలిపారు. కేసు వివరాల ప్రకారం అరెస్టు చేయబడిన నిందితుడు బోడ మహేష్, S/o ఓబుల్, 36 సం,, R/o చెర్ల తండ, గూడూరు మండలం అనే నిందితుడు తాను నీతి అయోగ్ డైరెక్టర్ అని ప్రభుత్వ పథకాల పేరుతో, ముఖ్యంగా ఎస్టి కార్పొరేషన్ ద్వారా లోన్లు మంజూరు చేయిస్తానని నమ్మబలికి బాధితుల నుండి నగదు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా టౌన్ ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ లోన్లు, సబ్సిడీలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు అడిగే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, ప్రభుత్వ పథకాల కోసం సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలను మాత్రమే సంప్రదించాలని ప్రజలకు సూచించారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు