ఘనంగా  విత్రీ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ 

ఘనంగా  విత్రీ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ 

  • ఆవిష్కరించిన  సీఎండీ  డా. కాచం సత్యనారాయణ
  •  గత 7 సంవత్సరాలుగా ప్రజాపక్షాన పోరాటం
  • ప్రభుత్వానికి వారధిగా,  నిష్పక్షపాత ధోరణితో  ముందుకు.. 

విశ్వంభర, హైదరాబాద్ : 2025 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని   విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దిన పత్రికల క్యాలెండర్  సంస్థ చైర్మన్ డా. కాచం సత్యనారాయణ చేతులమీదుగా చైతన్యపురిలోని ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. గత 7 సంవత్సరాలుగా ప్రజాపక్షాన పోరాడుతూ , ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వ్యవహరిస్తూ, నిష్పక్షపాత ధోరణితో  ముందుకు దూసుకుపోతున్న సందర్భాన విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర పత్రిక పాఠకులకు,  ప్రేక్షకులకు, వీక్షకులకు చైర్మన్  శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కాసం ఏకసాయి, హెచ్ ఆర్ నంగునూరి రమేష్, సీనియర్ సబ్ ఎడిటర్ సోమపంగు వెంకటేశ్వర్లు, మేడికొండ పరమేష్, రిపోర్టర్లు  గోవిందు ప్రసాద్, పూర్ణ చందర్, సాయి గౌడ్, సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డా. యర్రమాద కృష్ణారెడ్డి, తెలంగాణ  రాష్ట్ర  సేవాదళ్ కార్యదర్శి డా. కొదుమూరి దయాకర్ రావు , సీనియర్ కాంగ్రెస్ నాయకులు దాము మహేందర్ యాదవ్ , శ్రీనివాస్ యాదవ్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.  

Tags: