ఎండల వేళ ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ

విశ్వంభర,  తంగళ్ళపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న 130 మంది కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. గ్రామ ఉపసర్పంచ్ పయ్యాపుల బాలయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూలీల ఆరోగ్య రక్షణ కోసం మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ పయ్యాపుల బాలయ్య మాట్లాడుతూ కూలీలు ఎండ ఎక్కువ కాకముందే పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లాలని సూచించారు. వేసవి కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.

🕒 19 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-buttermilk-to-guaranteed-employment-during-sunny-days/article-15443

Tags: