అయ్యప్ప స్వామి దీవెనలతో గణిపాక సుధాకర్ అమరావతిల పెళ్లిరోజు కార్యక్రమం
On
విశ్వంభర హనుమకొండ జిల్లా;- వరంగల్ జిల్లా కాశీబుగ్గ మధురానగరి కాలనీలో శ్రీకాంత్, ఏపీ శీను, గురు స్వాముల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజలు నిర్వహించారు. 19వ డివిజన్ అధ్యక్షుడు గణిపాక సుధాకర్ అమరావతి ల వివాహ మహోత్సవం సందర్భంగా తన స్వగృహంలొ అయ్యప్ప స్వామి మహా పడిపూజ 200 మంది స్వాములతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి వారికి నైవేద్యాలు 18మెట్ల దీపాలతో ఆరాధన నిర్వహించడం జరిగింది. పడిపూజ కు వచ్చిన గురు స్వాములు, కన్య స్వాములు, సుధాకర్ అమరావతి దంపతులను శుభాకాంక్షలు తెలుపుతూ అయ్యప్ప స్వామి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని ఆశీర్వదించారు. కార్యక్రమంలో గణిపాక సాంబయ్య స్వరూప, గణిపాక కుమార్ మరియా, అనసూయ,పెద్ద బుజ్జా, రాజా,రాజు నీలిమ, కిరణ్ ,కన్నా ,రాజేష్, లోకేష్ ,బబ్లు, సాయి కృష్ణ ,నారాయణ, అనిల్, అమూల్య, తదితరులు పాల్గొన్నారు.



