అంబటి భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు
విశ్వంబర, చార్మినార్: తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ని తొలగించాలని వైసీపీ, నేత,అంబటి రాంబాబు ఏపీ, సీఎం చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్ నాగు నగేష్ ఆధ్వర్యంలో లాల్ దర్వాజా మోడు వద్ద అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబటి చిత్రపటం పై చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ నాగు నాగేష్ మాట్లాడుతూ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబును చెప్పులతో సన్మానం చేసి గాడిద మీద ఊరేగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు తయ్యాబా తస్నిమ్, శ్యామ్ సుందర్, సల్లా రాజ్ కుమార్ , బి. వై. శ్రీకాంత్ ,కె. జోగేందర్ సింగ్, అహ్మద్ షరీఫ్ ,సత్య కృష్ణ, ఆర్. అజయ్ , వినయ్ కుమార్ , రాములు , జి. కుమార్, అరునేష్ , రితేష్ , కుషాల్ , వివేక్ , జ్యూడి , నితిన్ కాగడ , తదితరులు పాల్గొన్నారు.



