రేపు సీఎం కప్ మండల స్థాయి ఎంపికలు
విశ్వంభర, ఇనుగుర్తి :గ్రామీణ ప్రాంతాలలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీఎం కప్ మండల స్థాయి సెలక్షన్లు సోమవారం మండల కేంద్రం ఇనుగుర్తిలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో బండారు పార్థసారథి తెలిపారు.శనివారం ఎంపీడీవో ఛాంబర్ లో ఇనుగుర్తి,కోమటిపల్లి ఫిజికల్ డైరెక్టర్లు తాళ్ల ప్రణయ్,మధుకర్ లతో సీఎం కప్ క్రీడల నిర్వహణపై సమాలోచనలు చేశారు.ఈ సందర్భంగా విలేకరులతో ఎంపీడీవో మాట్లాడుతూ, అథ్లెటిక్స్ ,కబడ్డి, కోకో, వాలీబాల్ విభాగాల్లో ఎంపికలు జరుగుతాయన్నారు. క్రీడలను ఇనుగుర్తి జెడ్పిహెచ్ఎస్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో నిర్వహించిన గ్రామీణ స్థాయి క్రీడా పోటీలలో ఎంపికైన క్రీడాకారులు సంబంధిత మండల స్థాయి సెలక్షన్లకు హాజరుకావాలన్నారు.వచ్చేప్పుడు ప్రతి క్రీడాకారుడు రిజిస్ట్రేషన్ ఫారం,ఆధార్ కార్డు తీసుకొని రావాలని సూచించారు. మండల స్థాయి క్రీడల్లో ఎంపికైన వారు అనంతరం నిర్వహించే పోటీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుందని చెప్పారు. మండల పరిధిలోని ఆయా గ్రామాల యువతీ యువకులు,విద్యార్థిని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కొట్టం రాము పాల్గొన్నారు.



