నల్లబెల్లిలో రైతుల నిరసన కార్యక్రమoలో పాల్గొన్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే
విశ్వంభర, నర్సంపేట : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నల్లబెల్లిలో రైతుల నిరసన కార్యక్రమoలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్దిసుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రేస్ పాలనలో రైతన్నది భరోసా లేని బ్రతుకైంది. వ్యవసాయ కూలీలను బానిసలుగా చూస్తున్న కాంగ్రేస్ సర్కార్ బీఆర్ఎస్ ఆద్వర్యంలో ఏక కాలంలో 179 గ్రామ పంచాయితీల్లో రైతన్న నిరసనగళం కర్షకులను మోసం చేస్తున్న కాంగ్రేస్ సర్కారుపై తమ గళం విప్పి గర్జించిన రైతులు రైతు కూలీలురుణమాఫి, రైతుభరోసా బోనస్, రైతుకూలి సాయం పేరుతో రైతన్నకు డోకా చేసిన కాంగ్రేస్ ప్రభుత్వం, రోడ్లపైకి వచ్చి రేవంత్ సర్కారుపై మెరుపు నిరసన రైతులు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యక్షంగా నిరసనలో పాల్గొన్న 20 వేల మంది రైతులు సర్కారు అసమర్థతను నిలదీసేందుకు కదంతొక్కిన 179 పల్లెలు హామీలు అమలు చేయ్ లేదంటే దిగిపో అంటూ రైతులు గర్జించారు.