సమస్య ల పరిష్కారానికి కృషి:మాజీ ఎమ్మెల్యే కిచ్చేన్న గారి లక్ష్మా రెడ్డి.

20

విశ్వంబర, ఎల్బీనగర్ :- మహేశ్వరం నియోజకవర్గం నియోజక వర్గం ఆర్కే  పురం డివిజన్ పరిధిలోని పలు కాలనీలల్లో మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బాధ్యుడు కిచ్చేన్న గారి లక్ష్మా రెడ్డి, టి పీసీసీ  ప్రతినిధి దేప భాస్కర్ రెడ్డి లు పర్యటించారు. శ్రీ రామ కృష్ణ పురం కాలనీ, హరిపురి కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. వారు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి,పున్న గణేష్ నేత, బండి మధుసూధన్ రావు, సురేంద్ర కుమార్, నానవాల జ్ఞానేశ్వర్ యాదవ్, పెద్దవూర సైదులు, బొడ్డుపల్లి మహేందర్, వంగాల శ్రీకాంత్ రెడ్డి, కాలనీల సంక్షేమ సంఘం, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Read More తెలంగాణ ఉద్యమ కళాకారుడు వేముల నరేష్ కన్నుమూత.