శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం

  • ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి  శ్రీధర్ బాబు

విశ్వంభర, బోడుప్పల్: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఉప్పల్ జోన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని పిర్జాదిగూడ లో గల పి & టి కాలనీ శ్రీభూ, నీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నూతన ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి తీర్థ ప్రసాదాల స్వీకరించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీధర్ బాబుని ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాలయాలు సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. అలాగే సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, పిర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, మాజీ కార్పొరేటర్  శ్రీధర్ రెడ్డి,యుగంధర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: