రేబిస్ నిర్మూలనకు సామూహిక టీకాలు
విశ్వంభర, ముషీరాబాదు : హైదరాబాదు ఇందిరాపార్క్ వద్ద ఆదివారం నిర్వహించిన రేబిస్ టీకాల కార్యక్రమంలో సిటిజన్స్ ఫర్ యానిమల్స్ (సీఎఫ్‌ఏ) ప్రతినిధులు మాట్లాడుతూ రేబిస్ నిర్మూలనకు సామూహిక టీకాలే సమర్థ మార్గమని తెలిపారు. సిటిజన్స్ ఫర్ యానిమల్స్ ప్రతినిధులు పృథ్వి, షాలిని, తేజ, ఆదిత్య, అనుపమ దేశ్‌పాండే, జీహెచ్‌ఎంసీ వెటర్నరీ అధికారి డాక్టర్ గిరీష్, జీహెచ్‌ఎంసీ అధికారి సద్గుణ, మధురోహా పెట్ క్లినిక్ వైద్యుడు డాక్టర్ అనంత్, పెట్ వైజర్ వైద్యుడు డాక్టర్ నరేష్ ఆధ్వర్యంలో నగరవ్యాప్తంగా వీధి కుక్కలకు ఉచిత రేబిస్ నిరోధక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ, మిషన్ రేబిస్, డబ్ల్యూవీఎస్ ఇండియా సంస్థల సహకారంతో చేపట్టిన ఈ ప్రచారం మూడు నెలల పాటు కొనసాగి సెప్టెంబర్ 28న నిర్వహించే ప్రపంచ రేబిస్ దినోత్సవంతో ముగియనుంది. ఈ కాలంలో నగరంలోని వేలాది వీధి కుక్కలకు ఉచితంగా రేబిస్ టీకాలు వేయడం ద్వారా వ్యాధి నియంత్రణను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ప్రత్యేక టీకాల బృందాలు వివిధ ప్రాంతాల్లో పర్యటించి వీధి కుక్కలకు ఉచితంగా టీకాలు అందజేస్తాయని పేర్కొన్నారు. తమ ప్రాంతాల్లోని వీధి కుక్కలను గుర్తించి టీకాలు వేయించేందుకు స్థానికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రేబిస్ ప్రాణాంతకమైనదైనా పూర్తిగా నివారించగల వ్యాధి అని, కుక్కలకు పెద్ద ఎత్తున టీకాలు వేయడం ద్వారానే మనుషులకు వ్యాపించే రేబిస్‌ను సమర్థవంతంగా అరికట్టవచ్చని వివరించారు. ప్రజల భాగస్వామ్యంతో రేబిస్ రహిత హైదరాబాదును సాధించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో: సిటిజన్స్ ఫర్ యానిమల్స్ వాలంటీర్లు, జీహెచ్‌ఎంసీ బృందం, మధురోహా పెట్ క్లినిక్ బృందం, పెట్ వైజర్ బృందం పాల్గొన్నారు.