పందిల్ల బ్రిడ్జి వద్ద భద్రతా చర్యలు చేపట్టాలి

  • హుస్నాబాద్ బిఆర్ఎస్ నాయకుల డిమాండ్

విశ్వంభర, హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్–పందిల్ల మధ్య నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని హుస్నాబాద్ బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సీనియర్ నాయకుడు అయిలేని మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ, బ్రిడ్జి వద్ద ఎలాంటి ప్రమాద సూచికల బోర్డులు, సైడ్ రైలింగ్‌లు లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని  తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తైనప్పటి నుంచి నాలుగు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా, ముగ్గురు మృతి చెందినట్లు పేర్కొన్నారు. బ్రిడ్జి సమీపంలో రైతులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ద్విచక్ర వాహనాలపై అధికంగా రాకపోకలు సాగిస్తున్నందున వెంటనే హెచ్చరిక బోర్డులు, రక్షణ రైలింగ్‌లు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో ప్రజల తరఫున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు యాస శ్రీనివాస్, బొమ్మగాని యెల్లగౌడ్, మంద జానకిరాం రెడ్డి, నమిలికొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

🕒 06 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/security-measures-should-be-taken-at-pandalla-bridge/article-18019

Tags: