కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
On
విశ్వంభర, అంబర్‌పేట : అంబర్‌పేట మండల పరిధిలోని 456 మంది లబ్ధిదారులకు మంగళవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఇందులో 305 మందికి కళ్యాణ లక్ష్మి, 151 మందికి షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, డాక్టర్ సి. రోహిన్ రెడ్డి, మోత రోహిత్ ముదిరాజ్, దిడ్డి రాంబాబు, పి. నారాయణస్వామి, పులి జగన్, బి. పద్మ వెంకటరెడ్డి, ఇ. విజయ్ కుమార్ గౌడ్, ఆర్. లక్ష్మణ్ యాదవ్, గరిగంటి రమేష్, తొలుపునూరి కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



