ఘనంగా అఖిలభారత ద్వి శతాధిక కవి సమ్మేళనం
విశ్వంభర, నెల్లికుదురు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని చాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో ఆదివారం సవ్యసాచి గ్రూప్స్ ఆఫ్ ఇండియా, శ్రీ శ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 'కృష్ణవేణి కవితోత్సవం – 169వ అఖిల భారత ద్విశతాధిక కవి సమ్మేళనం' వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురు మండలం, రాజులకొత్తపల్లి గ్రామానికి చెందిన రాష్ట్ర యువ నాయకుడు వరిపల్లి అనిల్ కుమార్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన ప్రముఖ కవులు, రచయితలు, సాహితీవేత్తల సమక్షంలో ఆయన మాట్లాడుతూ సమాజ హితం, సంస్కృతి పరిరక్షణలో సాహిత్యం, కవులు పోషిస్తున్న పాత్ర విశిష్టమైందని పేర్కొన్నారు. దేశ నలుమూలల నుంచి విచ్చేసిన కవులకు అభినందనలు తెలిపారు. సమాజ సేవతో పాటు సాహిత్య రంగానికి అందిస్తున్న ప్రోత్సాహాన్ని గుర్తించిన నిర్వాహకులు వరిపల్లి అనిల్ కుమార్‌ను వేదికపై శాలువాతో ఘనంగా సత్కరించి ప్రశంసాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలు జె. ఈశ్వరి భూషణం, సీఈఓ కత్తిమండ ప్రతాప్ కుమార్, ప్రణాళిక అధ్యక్షులు డా. పార్థసారథి, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన ప్రముఖ కవులు, రచయితలు, సాహిత్య విశ్లేషకులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి సాహిత్య వేదికపై సత్కారం అందించడం ఆనందంగా ఉందని, ఈ గౌరవానికి కారణమైన సవ్యసాచి గ్రూప్స్ ఆఫ్ ఇండియా, శ్రీ శ్రీ కళావేదిక నిర్వాహకులకు రాష్ట్ర యువ నాయకుడు వరిపల్లి అనిల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.