ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి 

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి 

  •  జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ

విశ్వంభర, గుండాల : మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అనంతారం లో జరిగిన ఉపాధ్యాయులు-తల్లిదండ్రుల  సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి కె. సత్యనారాయణ  మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయాల్సిన అవసరం తల్లి దండ్రులకు, ఉపాధ్యాయులకు, ప్రజా ప్రతినిధులకు ఉందని సూచించారు. పాఠశాల లో విద్యార్థుల చదువు, ప్రగతి సమావేశంలో తెలుసుకున్నారు. పాఠశాల సమస్యలపై తల్లిదండ్రులు , ప్రధానోపాద్యాయురాలు విన్నవించగా పరిష్కరిస్తాని హామి ఇవ్వడం జరిగింది. మద్యాహ్నం భోజనము గురించి పిల్లలను అడిగి తెలుసుకొని, పిమ్మట ప్రగతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి  మన్నె. అగ్గి రాములు, ప్రదానోపాధ్యాయురాలు. పి. రజనీ కుమారి, ఉన్నత పాఠశాల ప్రదానోపాధ్యాయురాలు. పునర్వసు,  శ్వేతా రెడ్డి, సి. ఆర్. పి. బసవ. లింగం,ఉపాధ్యాయులు ఏ. వేణు, ఎం. సుధాకర్, తల్లి దండ్రులు, రమేష్, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

Tags: