ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఫ్యాకల్టీ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక!
On
విశ్వంభర, హనుమకొండ :- సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైనన్స్ కళాశాలలో ఫ్యాకల్టీ క్లబ్ నూతన కమిటీ ఎన్నికలు సోమవారం కళాశాల ప్రాంగణంలో నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో చైర్మన్‌గా డాక్టర్ కర్ణాకర్ రావు ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌లుగా డాక్టర్ బిక్షపతి, డాక్టర్ ఫిరోజ్ బాషా, డాక్టర్ ఎల్. జితేందర్, డాక్టర్ సుచరిత పాల్, డాక్టర్ విజయ్ కుమార్ ఎంపికయ్యారు. కన్వీనర్‌లుగా డాక్టర్ మాదాసి కనకయ్య, డాక్టర్ చందూలాల్, డాక్టర్ సత్యజూలా, డాక్టర్ శ్రీలత, డాక్టర్ ఏ. సతీష్, డాక్టర్ టి. నాగయ్య ఎన్నికయ్యారు. కో-కన్వీనర్‌లుగా డాక్టర్ సునీత, డాక్టర్ మౌనిక, డాక్టర్ మయూరి, డాక్టర్ ఏ. రాజ్ కుమార్ ఎంపికయ్యారు. ట్రెజరర్‌లుగా డాక్టర్ సతీష్, డాక్టర్ సురేష్ బాధ్యతలు స్వీకరించారు.ఈసీ సభ్యులుగా డాక్టర్ బి. రాజశేఖర్, డాక్టర్ పుల్లా రమేష్, డాక్టర్ సుధీర్ కుమార్, డాక్టర్ అంజన్ రావు, డాక్టర్ ఆదిరెడ్డి, డాక్టర్ టి. శేషు, డాక్టర్ మాధ శ్రీనివాస్, డాక్టర్ సంజీవ్, డాక్టర్ కే. రాజేందర్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ బండి శ్రీనివాస్, డాక్టర్ రాజా కళ్యాణి, డాక్టర్ కోమటి లక్ష్మీనారాయణ, డాక్టర్ ఓ. మాధవి, డాక్టర్ బిక్కి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. మీడియా ఇన్‌చార్జిగా వేదాంతం హరికుమార్‌ను నియమించారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఫ్యాకల్టీ క్లబ్ చైర్మన్ డాక్టర్ కర్ణాకర్ రావు మాట్లాడుతూ కళాశాలలోని అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు పూర్తి కృషి చేస్తానని, అధ్యాపకుల సంక్షేమం కోసం క్లబ్‌ను మరింత చురుకుగా పనిచేసేలా తీసుకెళ్తానని తెలిపారు.



