హనుమకొండ చౌరస్తాలో మోదీ దిష్టిబొమ్మ దగ్ధం
విశ్వంభర, హనుమకొండ: హనుమకొండ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున హనుమకొండ చౌరస్తాలో మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ మాట్లాడుతూ, ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ప్రజలపై మరింత ఆర్థిక భారాన్ని మోపే చర్యగా అభివర్ణించారు. ఇంధన ధరల పెంపు వల్ల రవాణా ఖర్చులు పెరిగి, దాని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడుతూ సామాన్య ప్రజల జీవన వ్యయాన్ని మరింత పెంచుతోందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజలపై అదనపు భారాలు మోపడం కాకుండా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రజల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మరిన్ని ప్రజా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ , మాజీ కార్పొరేటర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.