108 అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ
On
విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలో 108 అంబులెన్స్ ను ప్రోగ్రాం మేనేజర్ జాన్ షాహిద్, ఈఎంఈ రాజబాబు ఆకస్మిక తనిఖీ చేశారు, అంబులెన్స్ లో ఉన్నటువంటి వైద్య పరికరాలు, మందులు వాటిని రోగులకు ఎలా ఇస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. అలాగే వాటి ఎక్స్పైరీ డేట్ ని కంపల్సరీ చూసుకోవాలని తెలియజేశారు. కేసు వచ్చిన వెంటనే తక్షణం స్పందించాలని బాధితులకు సహాయం చేయాలని , గోల్డెన్ అవర్ లో వాళ్ళని హాస్పిటల్ కి తరలించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎండ దెబ్బ(సన్ స్ట్రోక్ ) బాధితులకు వైద్యం ఎలా చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. తక్షణ సాయం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో
మహేశ్వరం ఎమర్జెన్సీ టెక్నీషియన్ భూపతి, పైలెట్ బాలకృష్ణ ఉన్నారు.



