దసరా 34వ వార్షిక శరన్నవరాత్రి ఉత్సవాలు 

దసరా 34వ వార్షిక శరన్నవరాత్రి ఉత్సవాలు 

విశ్వంభర,  రాఘవేంద్ర స్వామి నగర్, జమ్మి చెట్టు, ఉప్పు గూడ :- రాఘవేంద్ర స్వామి నగర్,జమ్మి చెట్టు, ఉప్పుగూడ లో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శివపార్వతుల కళ్యాణం, అన్నదానం ఘనంగా నిర్వహించారు. కమిటీ సభ్యులు జమ్మి చెట్టు రాజు మాట్లాడుతూ మా యొక్క రాఘవేంద్రస్వామి నగర్ కాలనీలో జమ్మి చెట్టు ఒక ప్రత్యేకత గా చెప్పారు. దసరాకు ప్రాశిస్త్యమైన జమ్మి చెట్టును మా పూర్వీకులు రూపం పోస్తే మేము ఆ చెట్టుకు ప్రాణం పోస్తున్నామని మా ప్రత్యేకత జమ్మి చెట్టు అని చెప్పుకొచ్చారు కార్యక్రమంలో భాగంగా సభ్యులు శ్రీనివాస్, అరవింద్, సురేందర్, రఘునందన్ రెడ్డి, నరేష్, రవికుమార్, అనిల్ కుమార్, ఎన్ సురేష్ మరియు కమిటీ సభ్యులు బస్తీలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మా యొక్క కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారని తెలిపారు.

Tags: