ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించాలి 

ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించాలి 

  •  అదనపు  కలెక్టర్ సీతారామా రావు 

 విశ్వంభర, సూర్యాపేట: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్  కె సీతారామారావు అన్నారు.  సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి ఆయన అర్జీలను స్వీకరించారు.  ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ,  ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులకు  అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు   పరిష్కరించాలని సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబందించి 40 దరఖాస్తులు, మున్సిపాలిటీ 13, డిపిఓ 5, డి డబ్ల్యు ఓ 2, మిగిలిన 35  దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని, మొత్తం 95 దరఖాస్తులు వచ్చాయాని వాటిని పరిష్కరించేందుకు శాఖల వారీగా పంపించటం జరిగిందని అదనపు కలెక్టర్ ఈ సందర్బంగా అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టరేట్ ఏవో సుదర్శన్ రెడ్డి, డిఆర్డిఓ అడిషనల్ పీడీ సురేష్,  జిల్లా అధికారులు హాజరైనారు.

Tags: