రాధికకు బెస్ట్ ప్రొఫెసర్ అవార్డు

రాధికకు బెస్ట్ ప్రొఫెసర్ అవార్డు

విశ్వంభర, భద్రాచలం: భద్రాచలం పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్న రాధిక “బెస్ట్ ప్రొఫెసర్” అవార్డుకు ఎంపికయ్యారు. ఆర్యవైశ్య సమాజానికి చెందిన రాధిక విద్యారంగంలో చూపుతున్న అంకితభావం, ప్రతిభ, సేవాస్ఫూర్తికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. రాధిక బోధనలో నూతన పద్ధతులను అనుసరిస్తూ విద్యార్థులలో సృజనాత్మకత, ఆలోచనా శక్తి పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. క్లాస్‌రూమ్ బోధనకు పరిమితం కాకుండా, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించడం ద్వారా సమగ్ర విద్యను అందిస్తున్నది. ఈ అవార్డు అందుకోవడం పట్ల కాలేజీ యాజమాన్యం ఆనందం వ్యక్తం చేస్తూ, రాధిక సేవలను ప్రశంసించింది.

Tags: