ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి

ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి

  •  సిఐ రాఘవేందర్  రెడ్డి 

విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని   గ్రామ పంచాయతీ కార్యాలయంలో  ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమములో భాగంగా  సర్పంచ్  మునగపాటి నవీన్  ఆధ్వర్యంలో గ్రామ సభ సమావేశము నిర్వహించారు. ఈ సమావేశానికి  ముఖ్య అతిధిగా మహేశ్వరం ఎంపీడీఓ శైలజ రెడ్డి, సీఐ రాఘవేందర్ రెడ్డి హాజరయ్యారు. గ్రామ సభ  ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగముగా గ్రామ పంచాయతీ లోని ప్రజలకు రోడ్ సేఫ్టీ గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సును ఉద్దేశిస్తూ సీఐ  రాఘవేందర్ రెడ్డి  మాటాడుతూ, గ్రామ ప్రజలు ఎవరు కూడా ట్రాఫిక్ నియమాలను అతిక్రమించకుండా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ అతివేగంగా వాహనాలను నడపరాదని తెలియజేశారు, ఎవరైతే ట్రాఫిక్ నియమాలను పాటించారో వారిపై కఠిన చర్యలు చ తీసుకుంటామని గ్రామ ప్రజలకు హెచ్చరించారు, అలాగే  గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్  మాట్లాడుతూ గ్రామ ప్రజలు వాహనాలు నడిపేవారు అందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్  ఇన్షూరెన్స్ తీసుకోవాల్సిందిగా తెలియజే యడం జరిగింది,  గ్రామ ప్రజలు ఎవరు కూడా చిన్న పిల్లలకి వాహలు ఇవ్వరాదని తెలియజేశారు. ఈ కార్యక్రమము లో ఎస్సై   ప్రసాద్, ట్రాఫిక్ ఏఎస్ఐ   సాదిక్, ఉప సర్పంచ్ జొరల రమేశ్ , వార్డు సభ్యులు తింగిరికారి బేబీ, పోల్కం సునీత, ఆవులకాడి కిష్టామ్మ, స్వర్ణగంటి సంజీవ, మహమ్మద్ ఆజం, కడమోని స్వాతి, వత్తుల శాలిని, కాకి పరమేష్, దిద్దెల శ్రీశైలం, ఆకుల వీరిబాబు, సున్నం స్వప్నా, జటావత్ రుకేష్, రెవెళ్ళ చంద్రమౌళి, శివగంగ ఆలయ కమిటీ ఛైర్మన్  అల్లే కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు  కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాకి ఈశ్వర్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లే బిక్షపతి మరియు పంచాయతి కార్యదర్శి సుజాత, గ్రామ పంచాయతి సిబ్బంది, గ్రామస్థులు తదితరులు  పాల్గొన్నారు.

Tags: