ప్రగతిశీల శక్తులకు అండగా నిలుద్దాం: డీఎస్‌ఓ
విశ్వంభర, హైదరాబాదు : ప్రజా ఉద్యమాలకు, ప్రగతిశీల శక్తులకు భవిష్యత్తులో అండగా నిలవాలని డీఎస్‌ఓ పూర్వ విప్లవ విద్యార్థులు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన డీఎస్‌ఓ పూర్వ విప్లవ విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. సమావేశానికి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు అధ్యక్షతన ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్‌ఓ వ్యవస్థాపక సభ్యుడు గుండా సత్యనారాయణ మాట్లాడుతూ, 1973లో శాస్త్రీయ, స్వతంత్ర, ప్రజాతంత్ర విద్యావిధానం కోసం, విద్యా వ్యాపారీకరణకు వ్యతిరేకంగా డీఎస్‌ఓ ఏర్పాటై, ఐదు దశాబ్దాలుగా విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటాలు సాగించిందన్నారు. 1982లో సంస్థ రెండు వర్గాలుగా విడిపోయినప్పటికీ, రెండు వర్గాలకు చెందిన పూర్వ నాయకులు ఈ సమావేశంలో పాల్గొని ఐక్యత అవసరాన్ని నొక్కిచెప్పారు. గత ఉద్యమాలను స్మరించుకుంటూ భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలకు తోడ్పాటునందించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో జెరిపోతుల ఉపేందర్, కర్రే సత్యనారాయణ, గునుగుంట్ల శ్రీనివాసరావు, శీలం స్వామి, టీవీ నరసింహరావు, సత్యనారాయణ, గంగ భవాని, సదానందం, సామ శ్రీనివాస్, యడ్ల భాస్కర్, సునీల్, చంద్ పాషా, రాములు, అజయ్, శశాంకర్, సుదీప్, గోలి కృష్ణ, శ్రీను, సంపత్ కుమార్, రమేష్, సుధాకర్, యాదిరెడ్డి, శ్యాం, గోపి, రహమత్ పాషా, సంతోష్ రెడ్డి, విప్లవ్ తదితరులు పాల్గొన్నారు.