పేదల ఇండ్లు కూల్చివేస్తే చూస్తూ ఊరుకోం

పేదల ఇండ్లు కూల్చివేస్తే చూస్తూ ఊరుకోం

  •  నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

విశ్వంభర, పెద్ద శంకరంపేట:  పేద ప్రజలకు అండగా టిఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే అక్రమంగా పేదల ఇండ్లను కూల్చివేస్తే చూస్తూ ఊరుకోమని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు.  మనూరు మండలంలోని బిల్లాపూర్ గ్రామంలో గత ప్రభుత్వం చట్టబద్ధంగా పట్టాలిచ్చిన ఇండ్లను కూల్చి వేస్తున్న  విషయమై శనివారం మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బెల్లాపూర్ లో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగామాజీ ఎమ్మెల్యే  మాట్లాడుతూ..
గత ప్రభుత్వంలో పేదలు నివసించడానికి వారికి అర్హులని భావించి నిరుపేదలకు ఇంటి స్థలాలను కేటాయించి వాటికి సర్టిఫికెట్లు కేటాయించామని ఇప్పుడు ఈ దౌర్భాగ్యమైన  ఈ ప్రభుత్వం. అన్యాయంగా వారి ఇండ్లపై బుల్డోజర్ తీసుకుపోయి వాటిని కులగోట్టి నిరుపేదలకు ఉండడానికి నీడ లేకుండా చేశారని మండిపడ్డారు.  రాష్ట్రంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి  ఇద్దరు పేద ప్రజల ఉసురు పోసుకుంటున్నారని ఆరోపించారు.  ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం దేవుడు ఎరుగు కానీ నిరుపేదలు నివసిస్తున్న గృహాలను నేలమట్టం చేయడం దురదృష్టకరమని తెలిపారు.  ఈ చర్యలు మానుకోకపోతే ఈ ప్రభుత్వం పైన పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని ఈ ముఖ్యమంత్రిని ఈ ఎమ్మెల్యేను గద్దెతించేవరకు ఊరుకోమని తెలిపారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకొని కేటాయించిన వారికి  ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం బాధితుల తరఫున మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి  సబ్ కలెక్టర్ ఉమా హారతి కి వినతి పత్రాన్ని అందజేసి నిరుపేద ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధితులు వారికి మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

🕒 26 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/lets-not-sit-back-and-watch-as-the-houses-of/article-19771

Tags: