మునుగోడు లోని కఠినమైన వైన్ పాలసీకి స్వాగతం పలికిన జిల్లా బిజెపి యువ నాయకులు డాక్టర్ వైభవ్ రెడ్డి
On
విశ్వంభర ,చేవెళ్ల: చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో డాక్టర్ వైభవ్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం అధికంగా విక్రయించమంటూ రాష్ట్ర ప్రభుత్వం సంకలు బాదుకుంటుంది అని కానీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాలసీని తెలంగాణ అంతట అమలు చేయాలంటూ మేము కోరుకుంటున్నానని రంగారెడ్డి జిల్లా బిజెపి యువ నాయకుడు డాక్టర్ వైభవ్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో మద్యం నియంత్రణకు సంబంధించి అమలు చేస్తున్న కఠినమైన వైన్ పాలసీ నిర్ణయాలకు ఆయన స్వాగతించారు. వైన్ దుకాణాలు గ్రామ పరిమితుల వెలుపల ఉండాలి నివాస ప్రాంతాల్లో కాకుండా పర్మిట్ రూములు ఉండకుండా అనుమతులు లేకుండా ఉన్న బెల్టు షాపులకు సరఫరా చేయకూడదు అని నిబంధనలు తీసుకురావాలని ఈ సందర్భంగా వారు కోరారు మద్యం విక్రయాలు సాయంత్రం నాలుగు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మాత్రమే జరపాలని ధరలు పెంచి విక్రయాలను మోసగించే సిండికేట్లపై చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్యం, సామాజిక సంక్షేమం, దృష్ట్యా అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ విధానాల అమలతో యువత మధ్యాసక్తి నుంచి దూరమవుతారని కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని మహిళలు ఎదుర్కొనే మద్యపాన దుష్ప్ర భావాలు గణనీయంగా తగ్గుతాయని యువ నాయకుడు తెలిపారు. ఆదాయమే లక్ష్యమే కాకుండా సమాజ శ్రేయస్సును ప్రధాన ఉద్దేశం గా తీసుకొని మునుగోడు ఎమ్మెల్యే చేపట్టిన ఈ నిర్ణయాలు ప్రశంసనీయమని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో అమలు చేస్తున్న ఈ వైన్స్ పాలసీని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒకే విధంగా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువత సంక్షేమం, ప్రజారోగ్యం, బాధ్యతాయుత పాలనకు దోహపడి ప్రతి నిర్ణయానికి బిజెపి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో క్రమశిక్షణ ప్రజారోగ్యం దీర్ఘకాలిక అభివృద్ధికి తోడ్పడే విధానాలకు బిజెపి ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన తెలిపారు.



