జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు చిరు కానుకల పంపిణీ. - BN రెడ్డి డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయ్ నేత

ముఖ్య అతిధిగా శ్రీశైలం దేవస్థానం బోర్డు ట్రస్టీ చిలువేరు కాశీనాథ్ 

జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు చిరు కానుకల పంపిణీ. - BN రెడ్డి డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయ్ నేత

  • సేవే పరమావధిగా సాగుతున్న గద్దె విజయ్ కు అభినందనలు 

విశ్వంభర, వనస్థలిపురం :- దీపావళి పండుగ సందర్బంగా మున్సిపల్ , వాటర్ సిబ్బందికి సచివాలయ నగర్ లో  బిఎన్ రెడ్డి డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయ్ నేత ఆధ్వర్యంలో చిరు కానుకలును  తెలుగుదేశం జాతీయ ఉపాధ్యక్షులు , శ్రీశైలం దేవస్థానం బోర్డు ట్రస్టీ సభ్యులు చిలువేరు కాశీనాథ్ చేతుల మీదుగా  అందజేశారు. ఈ సందర్బంగా కాశీనాథ్ మాట్లాడుతూ జిహెచ్ఎంసి కార్మికులకు పండుగ సందర్బంగా వారికి విజయ్ నేత టిఫిన్ బాక్స్ , మిఠాయిలు పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల మనసులను గెలుచుకున్నాడు. చిన్న కార్యక్రమం అయినప్పటికీ ఇది విలువైనది. మనం బాగుండడానికి, మన వీధులు శుభ్రంగా  ఉంచడానికి  నిరంతరం వారు భాద్యత గా సేవ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎన్నో సంక్షేమ సేవ కార్యక్రమాలు చేస్తూ విజయ్  ముందుకు సాగడం గొప్ప విషయం అని,  రానున్న ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలవాలని ఆకాంక్షిస్తున్నాని , వారి గెలుపు ప్రజల కోసం ,వారికి సేవ చేసే భాగ్యం ఈ ప్రాంత ప్రజలు వారికి తోడుండాలని కోరుతున్నాను. సమాజ హితమే లక్ష్యం గా సేవే పరమావధిగా తన కార్యక్రమాల ద్వారా ముందుకు సాగుతున్న విజయ్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ నగర్ అధ్యక్షులు సాంబశివ రావు , సీనియర్ సిటిజన్ అధ్యక్షులు కురుమ రావు , బాల్ రాజ్ , బాల్ రెడ్డి , శ్రీదేవి , భాగ్యలక్ష్మి, గోవర్ధన్ , రాజు, మహేష్ , శ్రీను , పారిశుద్ధ్య కార్మికులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. 

Tags: