మున్సిపల్ సిబ్బందికి దుప్పట్ల పంపిణి. - సామాజిక వేత్త , బియన్.రెడ్డి టిడిపి కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయ్ నేత
విశ్వంభర, ఎల్బీనగర్ ;- సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో గత 18 సంవత్సరాలగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నా సామాజిక వేత్త , బియన్.రెడ్డి టిడిపి కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయ్ నేత నేడు మున్సిపల్ సిబ్బందికి చలికాలం సందర్బంగా దుప్పట్లు పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిత్యం మనకోసం ఉదయాన్నే లేచి , పారిశుద్ధ్యం, పరిశుభ్రతపట్ల ఎంతో బాధ్యతగా సేవలు అందిస్తూ ఉండడం గొప్ప విషయమని అన్నారు. వారి ఆరోగ్యం పట్ల సామాజిక బాధ్యతతో నా వంతుగా చలికాలంలో ఇబ్బంది పడుతున్న వారికి ఏదోఒక విధంగా సాయంగా ఉండాలనే లక్ష్యం తో వారికి దుప్పట్లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులూ వెంకటేశ్వర్ రావు , శేఖర్ , గిరి , కిరణ్ , వెంకట్ , మల్లేష్ పలువురు ప్రముఖులు , అతిధులు , నాయకులు, స్థానిక కాలనీ వాసులు , కార్యకర్తలు తదితరులు పెద్దఎత్తున హాజరయ్యారు.



