అనుమతులు లేకుండా నడుపుతున్న కిడ్స్ ప్లేస్కూల్స్ మూసివేత
విశ్వంభర, బహుదూర్పుర: బండ్లగూడ జోన్ లో గౌలిపుర, బహుదూర్పుర జోన్ చార్ కమాన్ గోపాల్ కాంప్లెక్స్ లో యాక్సిస్ యాక్టివ్ కిడ్స్ ప్లే స్కూల్ ను ఎలాంటి అనుమతులు లేకుండా, పిల్లల భవిష్యత్తు అందకారంలోకి నెట్టుతూ, కనీసం ఫైర్ సేఫ్టీ లాంటివి లేకుండా గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి తల్లిదండ్రులను, విద్యాధికారులను మోసం చేస్తూ పాఠశాల నడుపుతున్నారు. విద్యార్థి సంఘాలు, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విద్యాధికారులు దానిమీద చర్యలు తీసుకొని పాఠశాలను మూసి వేయడం జరిగింది. విద్యాధికారులు కొంచెం అలస్యమైనా మొత్తానికి మూసి వేయడం ఆనందాన్ని కలిగించిందని అన్నారు.కానీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇలాంటి పాఠశాలల ను మీ దృష్టికి తీసుకొచ్చినట్లైతే మీరు ఈ విధంగానే తొందరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అని అన్నారు. ఎందుకనగా పిల్లల భవిష్యత్తు మరియు మోసపూరితమైన పాఠశాలలు ఉండడం వల్ల విద్యా వ్యవస్థ కుంటుపడుతుంది అని చెప్పుకొచ్చారు



