శ్రీ వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తింపు పట్ల హర్షం

శ్రీ వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తింపు పట్ల హర్షం

  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు
    26న రాష్ట్రవ్యాప్తంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు

విశ్వంభర, సూర్యాపేట: శ్రీ వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తింపు ఎంతో శుభ పరిణామం అని, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి దక్కిన గౌరవమని శ్రీ వాసవి సేవాసమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం  తెలిపారు. గురువారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం లో ప్రత్యేక  పూజలు నిర్వహించిన అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  శ్రీ వాసవి మాత జయంతిని ప్రతి ఏటా "వైశాఖ శుక్ల పక్ష దశమి"నాడు తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం జీవో  జారీ చేయడం పట్ల ఆయన  హర్ష వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవి మాత జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఆర్యవైశ్యుల చిరకాల కోరికను మన్నించి, వారి మనోభావాలను గౌరవించినందుకు ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఏప్రిల్ 26వ తేదీన వాసవి జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు.ఈ వేడుకల నిర్వహణకు పర్యాటక, సాంస్కృతిక శాఖను నోడల్ విభాగంగా ప్రభుత్వం ప్రకటించిందనీ,వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం ఆర్యవైశ్య సామాజిక వర్గానికి దక్కిన గౌరవమని ఆయన పేర్కొన్నారు.ఈ ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags: