ప్రజాస్వామ్యమా నీ జాడెక్కడ... మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడుపాక హనుమంతు సంస్మరణ సభలో వక్తల ప్రసంగం
On
విశ్వంభర, నల్లగొండ బ్యూరో:- ఆపరేషన్ కగార్ లో భాగంగా దేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తమ సమాజ స్థాపన కోసం సాయుధ పోరాటమే మార్గమని నమ్మి 45 సంవత్సరాల పాటు నమ్మిన సిద్ధాంతం కోసం వివిధ హోదాల్లో పని చేస్తూ సెంట్రల్ కమిటీ సభ్యునిగా మూడు రాష్ట్రాల ఇన్చార్జిగా పనిచేస్తున్న చండూర్ మండలం, పుల్లెంల గ్రామానికి చెందిన పాక హనుమంతు అలియాస్ గణేష్ ఎన్కౌంటర్లో మరణించిన విషయం తెలిసిందే.. అమరుని సంస్కరణ సభను వివిధ సంఘాల కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సభలో సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ చీలికలు, పేలికలుగా ఉండటం వలన బిజెపి పార్టీని దాని భావజాలాన్ని, ప్రస్తుత బిజెపి ప్రభుత్వానికి బలంగా మారిందని ఆయన తెలిపారు. అడవుల్లో ఖనిజ సంపద కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించకుండా, ఆపరేషన్ ఆపి చర్చలకు మావోయిస్టులను పిలవాలని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు.పౌర హక్కుల సంఘం నాయకుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ పాక హనుమంతుని చంపి రాజ్యం మానసిక ఆనందం పొందిందని ఆయన అన్నారు. రాజ్యం ఎన్ని ఆంక్షలు విధించిన దేశంలో ఈమధ్య జరిగిన ఎన్కౌంటర్లలో మరణించిన అమరుల యాత్రలలో పాక హనుమంతు అమరులు యాత్ర 20వేల మంది పాల్గొనడం ప్రజలు గెలిచారనే అర్థమవుతుందనీ అన్నారు. బ్రాహ్మణిజం కులాలు ఆర్ఎస్ఎస్ ను పెంచి పోషిస్తున్నాయని తెలిపారు. దేశంలో విద్య తాడిత పీడిత ప్రజలకు అందోద్దని ఉద్దేశంతో 80 శాతం మంది ప్రజలకు విద్యను దూరం చేయాలనే ఉద్దేశమే ఆపరేషన్ కగారు ఉద్దేశం అని ఆయన తెలిపారు. సుధాకర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, అమిత్ షా మావోయిస్టులనే చంపడానికి పోలీసులను కావాలనే ఉసి కో లుపుతున్నారని తెలిపారు. ఇది అన్యాయం అని ప్రశ్నించిన గాదె ఇన్నయ్య ను జైల్లో వేశారని ఆయన తెలిపారు. దేశంలో రాజకీయాలు కిరాతకంగా చేస్తున్నాయో ఈ ఎన్కౌంటర్లు చూస్తే అర్థమవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, విరసం కార్యదర్శి వీర, పూర్వ విద్యార్థులు సంఘం కార్యదర్శి భరద్వాజ, బంధుమిత్రుల కమిటీ నాయకులు భవాని, అనురాధ, మా భూమి సంధ్య, ఉష ,భవాని ,దీప, సుశీల, కవిత న్యూడెమోక్రసీ నాయకురాలు అనురాధ, మాజీ మావోయిస్టులు భవనం శ్రీనివాస్ రెడ్డి, దాడి శ్రీనివాస్ రెడ్డి, బాబన్న, కావలి యాదగిరి, పిట్టల శంకర్, అంతటి జంగయ్య, నక్క యాదగిరి, స్థానిక కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ ముక్కామల ఎంకన్న, టిఆర్ఎస్ నాయకులు గుర్రం వెంకటరెడ్డి, బోయపల్లి రమేష్, బొమ్మర బోయిన వెంకన్న, వెంకటరెడ్డి, లోకేష్, సిపిఐ నాయకులు మండల కార్యదర్శి నల్పరాజు సతీష్, రామలింగయ్య, పల్లె యాదయ్య, శంకర్, బొడ్డు వెంకన్న, చివర్ల లింగస్వామి, తెలంగాణ జన సమితి నాయకులు పల్లె వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు



