బీఆర్ ఎస్ బాటలోనే కాంగ్రెస్.. బీజేపీ కేంద్ర మంత్రుల విమర్శలు

బీఆర్ ఎస్ బాటలోనే కాంగ్రెస్.. బీజేపీ కేంద్ర మంత్రుల విమర్శలు

 

కాంగ్రెస్ కూడా బీఆర్ ఎస్ బాటలోనే ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని బీజేపీ కేంద్ర మంత్రులు విమర్శలు గుప్పించారు. సికింద్రాబాద్ లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ పాల్గొన్నారు. ముందుగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ ఎస్ బాటలోనే నడుస్తోందని విమర్శలు గుప్పించారు. 

Read More ప్రైవేట్ రంగం రిజర్వేషన్ చట్టం

నైతిక విలువలకు రాజకీయాల్లో తిలోదకాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇతర పార్టీల గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేయడం అంటే రాజ్యాంగ విరుద్ధమే అంటూ మండిపడ్డారు కిషన్ రెడ్డి. గతంలో కేసీఆర్ ఇలాగే చేసి ప్రజాగ్రహానికి గురయ్యారని గుర్తు చేశారు. 

ఇప్పుడు రేవంత్ కూడా అదే బాటలో నడుస్తున్నారని.. కాబట్టి ఆయన కూడా ప్రజాగ్రహానికి గురవుతారని తెలిపారు. ఇక బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు మాత్రమే నిధులు ఇస్తున్నారని.. ఇది కరెక్ట్ కాదని విమర్శలు గుప్పించారు.