వైబ్రేట్ అకాడమీ టాలెంట్ టెస్ట్. - అకాడమీ డైరెక్టర్ రాజేందర్ రెడ్డి వెల్లడి.
విశ్వంభర హనుమకొండ జిల్లా:-తేది 28.11.2025 శుక్రవారం రోజున వైబ్రేట్ అకాడమీ (కోట రాజస్థాన్) హన్మకొండ సెంటర్‌లో ఏర్పాటు చేయబోతున్న స్కాలర్‌షిప్ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 10వ తరగతి విద్యార్థి, విద్యార్థినుల వారి యొక్క సృజనాత్మకతను వెలికితీయడానికి ఆదివారం (30.11.2025) రోజున టెస్ట్ ను నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ చిట్టేటి రాజేందర్ రెడ్డి కరపత్రాన్ని విడుదల చేశారు.వైబ్రేట్ అకాడమీడైరెక్టర్ రాజేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ. త్వరలో జరగబోయే టాలెంట్ టెస్ట్ దేశంలోనే అగ్రగామి అయిన వైబ్రేట్ అకాడమీలో ఐఐటి నీట్. వేల సంఖ్యలో సీట్లు సాధించడం జరిగింది కావున అదే స్ఫూర్తితో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులు తమ నైపుణ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం గా భావించి అధిక సంఖ్యలో పాల్గొనగలరు అని అన్నారు ఈ పరీక్షలో ఉత్తీర్ణత కనబరిచిన మొదటి ఐదుగురి విద్యార్థిని విద్యార్థులకు ట్యూషన్ ఫీజు పూర్తిగా ఉచితంగా కల్పిస్తామని అన్నారు. మిగతా విద్యార్థిని విద్యార్థుల కు మార్కుల ఆధారంగా ట్యూషన్ ఫీజులో కొంత రాయితీని ఇవ్వడానికి వైబ్రేట్ ఆకాడమీ యాజమాన్యం నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ప్రతి స్కూల్లో జరిగిన స్కాలర్షిప్ టెస్టుల్లో ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు విద్యార్థిని విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో రాయితీ ఇవ్వబడుతుందని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో వైబ్రేట్ అకాడమీ ప్రిన్సిపల్ శేష్ కుమార్ అకాడమీ హెడ్ రామకృష్ణ ఏజీఎంఎస్ గుండాల రాజు మాలోతు నారాయణ సింగ్ దండు రాజు కోఆర్డినేటర్ రాము మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ విజయ్ కుమార్ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



