ప్రతి పౌరుడికి సమాన హక్కు - కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడి.
విశ్వంభర, నక్కలగుట్ట:- భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతి పెద్ద లిఖిత రాజ్యాంగాలలో ఒకటి అని, దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిందని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు . బుధవారం నక్కలగుట్ట ఎన్పీడీసీఎల్ విద్యుత్ భవన్ కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు విచ్చేసి సీఎండీ అధికారులు, సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ. ప్రతి ఒక్క ఉద్యోగి తమ విధి నిర్వహణలో భాద్యత యుతంగా పని చేయాలని అన్నారు . అధికారాలు, బాధ్యతలను సమన్వయపరుస్తూ ఎలా ఉండాలో కూడా రాజ్యాంగం నిర్దేశిస్తోందని చెప్పారు . ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టాలని, దేశ అభివృద్ధికి కృషి చేయాలనీ కోరారు . ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వి . మోహన్ రావు , వి . తిరుపతి రెడ్డి , సీవీవో బోనాల కిషన్ , సి.ఈ లు టి . సదర్ లాల్ , కె . తిరుమల్ రావు , కె . రాజు చౌహన్, కె. వెంకట రమణ , అశోక్ , అన్నపూర్ణ , సురేందర్ , శ్రవణ్ కుమార్ , సీజియంలు రవీంద్రనాధ్ , చరణ్ దాస్ జాయింట్ సెక్రటరీ శ్రీ కృష్ణ , జియంలు గిరిధర్ , శ్రీనివాస్ , వాసుదేవ్ , మల్లికార్జున్ , నాగ ప్రసాద్ , సామ్య నాయక్ , హేమంత్ కుమార్ , కళాధర్ రెడ్డి , జయరాజ్ తదితరులు పాల్గొన్నారు .



