ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా పోరాడుదాం. -   ఎన్ కౌంటర్లన్ని  ప్రభుత్య హత్యలే, కార్పొరేట్ హత్యలే.. - ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక డిమాండ్ 

ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా పోరాడుదాం. -   ఎన్ కౌంటర్లన్ని  ప్రభుత్య హత్యలే, కార్పొరేట్ హత్యలే.. - ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక డిమాండ్ 

విశ్వంభర,  సిద్దిపేట :-  జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో “ ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా- ఎన్ కౌంటర్లన్నీ కార్పొరేట్,ప్రభుత్వ హత్యలే “ అంటూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక రాష్ట్ర కన్వీనర్ వంగల సంతోష్ మాట్లాడుతూ గత 22 నెలలుగా  ఆపరేషన్ కగార్ పేరు మీద వందలాది ఆదివాసులను హత్యలు చేస్తూ, ఆదివాసీ ప్రాంతాల్లో బేస్ క్యాంపులు నెలకొల్పి ఆదివాసీ ప్రజల్లో నిత్యం భయాందోళన కలిగిస్తూ అటవీ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెటేందూకే ఈ హత్యల,మానవ హననపు పరంపర కొనసాగుతుంది.ఒక వైపు ప్రకృతి విధ్వంసంతో వాతావరణంలోని ఓజోన్ పోర దెబ్బతింటుంటే,అడవులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉండాల్సింది పోయి అడవులను విధ్వంసం చేస్తూ కృత్రిమ అడవులను సృష్టించిన కానీ మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరకదు.కార్పొరేట్ కంపెనీల లాభాపేక్షం కోసం చట్టాలను మారుస్తూ వారికి అనుగుణంగా కేంద్రం ప్రభుత్వం మోడీ అమిత్ షా లు మధ్య భారత దేశంలో నిత్యం రక్తాన్ని పారిస్తున్నారు.ఆపరేషన్ కగార్ పేరు మీద గత 22 నెలలుగా జరుగుతున్న ఈ రాజకీయ ప్రభుత్వ,కార్పొరేట్ హత్యలను తక్షణమే సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి గారిచే న్యాయ విచారణ జరిపించాలని,అలాగే ఈ హత్యలను మానవ హక్కుల కమీషన్ సుమోటోగా స్వీకరించి విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భారత దేశంలో ఒక రాజ్యాంగం అమలులో ఉన్నది.ఆ రాజ్యాంగం ప్రకారం,దాని మీద ప్రమాణం చేసిన పాలకులు ఆ రాజ్యాంగ పరిధిలోనే పరిపాలన కొనసాగించాలి కానీ భారత రాజ్యాంగమే ఈరోజు సంక్షోభంలోకి నెట్టివేయబడ్డ కాలంలో మనం జీవిస్తున్నాం.కావున సంక్షోభం కాలం భారత రాజ్యాంగ హక్కుల కోసం ఉద్యమిద్దాం.ఆపరేషన్ కగార్ వ్యతిరేకంగా పోరాడుదామంటూ పిలుపునిస్తున్నాం.

 

Read More రిజర్వేషన్ల జీవో, నోటిఫికేషన్ పైప హైకోర్టు స్టే

ఉద్యమాభివందనాలతో 
వంగల సంతోష్ 
రాష్ట్ర కన్వీనర్ 
ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక 


కస్తూరిపల్లి ప్రభాకర్ 
రైతు కూలీ సంఘం 


విష్ణు,రాజేష్,శేఖర్ 
PDSU (విజృంభణ)

రాజు న్యాయ విద్యార్థి 
సంజయ్ (ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక)

 

Tags: