నిందితులే బాధితులుగా HRC లో పోలీసులపై తప్పుడు పిర్యాదులు 

నిందితులే బాధితులుగా HRC లో పోలీసులపై తప్పుడు పిర్యాదులు 

విశ్వంభర, హైదరాబాద్ :- ప్రభుత్వ కార్యాలయాల్లో అన్యాయం జరిగిన వారికి ఆపద్భాందువు గా కనిపించేది రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ . భాదితులకు న్యాయం జరుగుతుందని రాష్ట్రం మారుమూల ప్రాంతాల నుంచి కూడా భాదితులు కమిషన్ ను ఆశ్రయిస్తున్నారు. ఆర్ధికంగా , సామాజికంగా రాజకీయంగా ఏ విధంగా ఆసరా లేని బడుగు బలహీన వర్గాలకు కమిషన్ ఒక దేవాలయం గా కనిపిస్తుంది. కానీ కమిషన్ ఏ ఉద్దేశ్యంతో ఏర్పాటు అయ్యిందో దానికి బిన్నంగా అరాచకాలకు, అక్రమాలకు పాల్పడుతున్నవారు పోలీసులు తమపై చర్యలు తీసుకోకుండా వారిపై నిందారోపణలతో కమిషన్ ను ఆశ్రయిస్తున్నారు. దీనితో భాదితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. పలు నేరాల్లో నిందితులుగా ఉండి పోలీసులను బ్లాక్ మెయిల్ చేస్తూ వారిపై ఒత్తిడి తెచ్చే చర్యలకు పాల్పడుతున్నారు. పోలీసులపై కమిషన్ కు వచ్చే ఫిర్యాదులు యాభై నుండి అరవై శాతం తప్పుడు ఫిర్యాదులుగా నమోదు అవుతున్నాయి. తాజాగా మహబూబ్ బాద్ జిల్లా  గార్ల మండల కేంద్రంలో బోడ తులసీరామ్ ఇతను హోమ్ గార్డ్ గా పని చేస్తున్నాడు. ఇతని పొరుగువాడైన ఉపరపు చిదంబరం పౌరోహిత్యం చేస్తూ ఉంటాడు. ఈ బోడ తులసీరామ్ వాస్తు రీత్యా ప్రహరీ గోడ నిర్మాణంలో అతని అంగీకారంతోనే నిర్మాణం చేయడం జరిగింది. తరవాత తులసీరామ్ తానూ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నానని తానూ ఎస్టీ అని అందరిని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయమై గ్రామ పెద్దలు సర్వే నిర్వహించి హద్దుల ఏర్పాటు చేశారు. దీనిని తులసీరామ్ భార్యాభర్తలు అంగీకరించలేదు. వీరు స్వయంగా ఒక సర్వేయర్ తోటి సర్వే నిర్వహించారు. దానిని కూడా వీరు తిరస్కరించారు. చివరిగా పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి సమాజంలో అశాంతి ప్రబలకుండా అందరు సోదరభావంతో ఉండాలని చేసిన ప్రయత్నం విఫలం అయ్యింది. ఇప్పటివరకు వీళ్ళు రెండు సార్లు పర్యాయాలు చిదంబరం ప్రహరీగోడను కూలగొట్టడమే కాకుండా కూలీలపై దాడులకు పాల్పడ్డారు . విలేకరుల బృందం మానవ హక్కుల కమిషన్ లో చేసిన ఫిర్యాదు పై క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లక గ్రామస్థులు చెప్పిన అంశాలు నిందితులే బాధితులుగా సమాజంన్ని కానీ పోలీసులను కానీ ఏ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారో అవగతం అవుతుంది. కమిషన్ కూడా పిటీషన్ దాఖలు చేసిన తరవాత పూర్వాపరాలు పరిశీలించడానికి పోలీసులకు తగిన సమయం ఇవ్వటం సమంజసంగా ఉంటుంది.

Tags: