తిరుమల సహకార పట్టణ బ్యాంకు ను ప్రారంభించిన - శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ స్వామిజీ.

తిరుమల సహకార పట్టణ బ్యాంకు ను ప్రారంభించిన - శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ స్వామిజీ.

విశ్వంభర, హైదరాబాదు : హైదరాబాదు సంతోష్ నగర్ లో  తిరుమల సహకార పట్టణ బ్యాంకు లిమిటెడ్‌ కొత్త శాఖను ఆదివారం  ప్రారంభించిన  శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ స్వామిజీ. ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. స్థాపన నుంచీ విజయవంతమైన సేవలతో మధ్యతరగతి, దిగువ తరగతి ఖాతాదారులకు ఉపయోగకరమైన రుణాలు అందిస్తున్నట్లు, నగదు యంత్ర సేవ, మొబైల్‌ బ్యాంకింగ్‌, యూపీఐ, గూగుల్‌ పే, ఫోన్‌పే వంటి డిజిటల్‌ సేవలు కూడా ఖాతాదారులకు అందుబాటులో ఉన్నాయని, భారత రిజర్వ్‌ బ్యాంకు ఈ కొత్త శాఖకు అనుమతి ఇచ్చినట్లు బ్యాంకు అధ్యక్షుడు నంగునూరి చంద్రశేఖర్‌ తెలిపారు.  త్వరలో జంట నగరాల్లో మరికొన్ని శాఖలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి వాకిటి రామకృష్ణారెడ్డి, నటుడు సుమన్‌,  మల్లికార్జునరావు తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

Tags: